Skip to main content

కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులు

కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండు, అదనపు నిధులను బదిలీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిర్ణయించింది.
బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులు, ఆర్‌బీఐ బోర్డు సూచనల ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆగస్టు 26న బిమల్ జలాన్ కమిటీ సిఫారసులను ఆమోదించింది. ఈ కమిటీ సిఫారసుల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,76,051 కోట్లను కేంద్రానికి ఆర్‌బీఐ బదిలీ చేయనుంది.

ఆర్‌బీఐ ప్రకటన సారాంశం...
కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్‌బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది) అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కేంద్రప్రభుత్వానికి రూ.1,76,051 కోట్ల నిధులు బదిలీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 27 Aug 2019 05:30PM

Photo Stories