Skip to main content

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డీ వాసాల కన్నుమూత

బాలల మనోవికాసానికి బాటలు వేసిన బాలసాహితీమూర్తి, కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత వాసాల నరసయ్య(79) కన్నుమూశారు.
Current Affairs
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లో ఫిబ్రవరి 14న కన్నుమూశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్దిలో 1942, జనవరి 26న వాసాల నరసయ్య జన్మించారు. 40 ఏళ్లుగా బాలసాహిత్య రచనకు అంకితమై కథ, కవిత, గేయం, పొడుపు కథ రూపాల్లో 36 పుస్తకాలు వెలువరించారు.

నరసయ్య రచించిన కథలలో ‘బాలల బొమ్మల కథలు’, ‘చిట్టిపొట్టి కథలు’, ‘అంజయ్య-అరటితొక్క’, ‘రామయ్య’‘యుక్తి’ప్రముఖమైనవి. చిరు తరంగాలు, గోగుపూలు, పసిమొగ్గలు, గులాబీలు వంటి బాలల కథల పుస్తకాలకు ఆయన సంపాదకత్వం వహించారు. బాల సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు 2009 నుంచి నరసయ్య సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. పోస్టల్ శాఖలో హెడ్ పోస్ట్‌మాస్టర్‌గా 2002లో ఉద్యోగవిరమణ పొందిన ఆయన 2017, నవంబర్ 14న కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : వాసాల నరసయ్య(79)
ఎక్కడ : కరీంనగర్, కరీంనగర్ జిల్లా
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 15 Feb 2021 05:56PM

Photo Stories