కేంద్ర రక్షణ శాఖ ప్రారంభించిన ఈ-ఛావనీ పోర్టల్ ఉద్దేశం?
Sakshi Education
దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డుల్లో నివసిస్తున్న ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పౌర సేవలు అందించేందుకు కేంద్ర రక్షణ శాఖ ‘‘ఈ-ఛావనీ పోర్టల్’’ అనే మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది.
ఫిబ్రవరి 16న ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ యాప్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ-జీవోవీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) డెరైక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్ (డీజీడీఈ), నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా కంటోన్మెంట్ బోర్డుల్లో నివసించే ప్రజలు పలు సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-ఛావనీ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డుల్లో నివసిస్తున్న ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పౌర సేవలు అందించేందుకు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-ఛావనీ పోర్టల్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డుల్లో నివసిస్తున్న ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా పౌర సేవలు అందించేందుకు...
Published date : 17 Feb 2021 05:54PM