కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన పీఎం-వాణి కార్యక్రమం ఉద్దేశం?
Sakshi Education
దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘‘పీఎం-వాణి(PM-WANI)’’ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది.
పీఎం వాణి(పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేజ్) కార్యక్రమంలో భాగంగా... పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ‘పబ్లిక్ వైఫై నెట్‌వర్క్’లను నెలకొల్పుతారు. ఎలాంటి అనుమతులు, రుసుం, నమోదు అవసరం లేకుండానే పీడీఓల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. దీంతో దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరలెవనుంది.
మరిన్ని అంశాలు...
- వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్‌స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది.
- పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది.
- యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి, డిస్‌ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు.
- యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది.
- ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ-డాట్ నిర్వహిస్తుంది.
- వైఫై సేవల విస్తరణలో భాగంగా కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం-వాణి(PM-WANI)కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు
Published date : 10 Dec 2020 07:02PM