కేంద్ర హోం మంత్రితో సీఎం జగన్ సమావేశం
Sakshi Education
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఢిల్లీలో ఆగస్టు 26న జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 13లో పొందుపరిచిన నిబంధనల మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అమిత్ షాను జగన్ కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక పెండింగ్ అంశాలను మంత్రికి నివేదించారు.
మరోవైపు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అంశాన్ని మంత్రితో జగన్ చర్చించారు. పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా మంత్రి షెకావత్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఢిల్లీ

Published date : 27 Aug 2019 05:29PM