Skip to main content

కేంద్ర బడ్జెట్‌ 2021–22 హైలైట్స్‌

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. డిజిటల్‌ పద్ధతిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. బడ్జెట్ వివ‌రాలు యూనియన్‌ బడ్జెట్ అనే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
Current Affairs

బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • చరిత్రలో తొలిసారి పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ‌పెట్టారు. మేడ్ ఇన్‌ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భ‌ద్రప‌రిచారు. ట్యాబ్‌లో చూసి ఆమె బ‌డ్జెట్ ప్రసంగం చేశారు.

ఆత్మనిర్భర్‌ యోజన పథకం
  • 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
  • 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం
  • నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

ఆరోగ్య రంగానికి పెద్దపీట
  • 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
  • కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం

20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే
  • వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
  • పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
  • వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య సరకు రవాణా కారిడార్‌
  • 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
  • 11వేల కి.మీ జాతీయ రహదారుల కారిడార్‌ నిర్మాణం
  • బెంగాల్‌లో 675 కి.మీ మేర జాతీయ రహదారుల అభివృద్ధి
  • ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌కోస్ట్‌ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు
  • బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లు
  • 20121-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతం
  • 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతం
  • 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయం

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు
  • బ్యాంకుల నిరర్ధక ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం
  • మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు
  • ఇక నుంచి బ్యాంకుల ఎన్‌పీఏలు బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయింపు
  • ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
  • బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు
  • 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
  • 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
  • రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
  • 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
  • జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు
  • కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు
  • మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌
  • కొత్తగా బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
  • మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు

కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు
  • రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
  • వ్య‌వ‌సాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
  • 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
  • కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
  • 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
  • తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
  • రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
  • 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
  • 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు

విద్యుత్‌ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
  • గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు
  • తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు
  • విద్యుత్‌ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
  • పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
  • ఉజ్వల స్కీమ్‌ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు
  • జమ్మూకశ్మీర్‌లో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు
  • కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్‌ పంపిణీని పటిష్టం చేస్తాం
  • సొలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
  • బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు

2021 ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ
  • ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • 2021 ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ
  • 2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ
  • 15 వేల పాఠశాలలు శక్తివంతం
  • కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
  • ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
  • లెహ్ లో యూనివర్సిటీ ఏర్పాటు

డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
  • 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
  • 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
  • ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం

సీనియర్ సిటిజన్స్‌‌కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు
  • పన్ను చెల్లింపుదారుల 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగారు.
  • 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్‌‌కు ఆదాయ పన్ను దాఖలు నుంచి మినహాయింపు
  • ఎన్నారై పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహం
  • ఎన్నారైలు భారత్‌లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు
  • ఎన్‌ఐఆర్‌లకు డబుల్‌ టాక్సేషన్‌నుంచి ఊరట
  • పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు
  • అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు
  • ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
  • ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
  • 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
  • పన్ను మినహాయింపులు మరో ఏడాది పొడిగింపు

ధ‌ర‌లు పెరిగేవి.. తగ్గేవి
  • మరింత పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
  • లీటర్‌ డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్సు
  • పెట్రోల్ ‌లీటర్‌కు రూ.2.05 పైసలు వ్యవసాయ సెస్సు
  • పెరగనున్న మొబైల్‌ ధరలు
  • అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ
  • ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు
  • ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు
  • 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు
  • రాగిపై పన్ను మినహాయింపులు
  • పెరగనున్న సోలార్‌ ఇన్వెటర్ల ధరలు
  • ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపు
  • పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు
  • కాటన్‌పై 10శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపు
  • దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు
  • పెరగనున్న లెదర్‌ ఉత్పత్తుల ధరలు
  • ఆదాయ పన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట
  • ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు
Published date : 01 Feb 2021 03:13PM

Photo Stories