Skip to main content

కే2-18బీ గ్రహంపై నీటి జాడలు

సౌర కుటుంబం వెలుపల ఉన్న (ఎక్సో ప్లానెట్) కే2-18బీ గ్రహంపై ద్రవ రూపంలో ఉన్న నీటిని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీంతో అక్కడ ప్రాణులు జీవించేందుకు అనుకూల వాతావరణం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. చాలా వరకు ఎక్సో ప్లానెట్లపై భారీ వాయుగోళాలు, శిలలు ఉన్నాయని వాటిపై ఎలాంటి వాతావరణం లేదని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొ.జియోవన్నా టిన్నేటి తెలిపారు. ఇప్పటివరకు బయటి నక్షత్ర మండలంలో దాదాపు 4 వేల వరకు గ్రహాలను గుర్తించారు... కానీ ఈ గ్రహం మాత్రమే శిలలతో కూడిన ఉపరితలం, నీటితో కూడి వాతావరణం కలిగి ఉందన్నారు.

శాస్త్రవేత్తల పరిశోధనలోని అంశాలు
  • భూమి కన్నా 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి, రెండు రెట్లు ఎక్కువ పెద్దదైన కే2-18బీ అనే ఈ గ్రహం అక్కడి నక్షత్ర మండలంలోని ఓ నక్షత్రం చుట్టూ జీవానుకూల ప్రాంతంలో తిరుగుతోంది.
  • భూమి నుంచి కే2-18బీ దూరం: 110 కాంతి సంవత్సరాలు
  • చేరుకోవడానికి పట్టే సమయం: ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే పార్క్ సోలార్ ప్రోబ్ రాకెట్‌లో గంటకు 7 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 1,70,000 సంవత్సరాల్లో దాన్ని చేరుకోవచ్చు.
  • ఈ గ్రహాన్ని నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు తొలిసారిగా 2015లో కనుగొన్నారు.
Published date : 13 Sep 2019 06:11PM

Photo Stories