కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
Sakshi Education
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద డిసెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.
పరిశ్రమకు సంబంధించి ఫైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ పరిశ్రమ(కడప ఉక్కు పరిశ్రమ)కు ముడిసరుకు అందించేందుకు ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు.
కడప ఉక్కు పరిశ్రమకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సున్నపురాళ్లపల్లి, జమ్మలమడుగు మండలం, వైఎస్సార్ జిల్లా

Published date : 24 Dec 2019 05:56PM