Skip to main content

కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతి

కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) మృతి చెందారు.
జూలై 29న అదృశ్యమైన సిద్ధార్థ జూలై 31న కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను జూలై 31న నిర్వహించారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ మృతి
ఎప్పుడు : జూలై 31
ఎవరు : వీజీ.సిద్ధార్థ (59)
Published date : 01 Aug 2019 05:42PM

Photo Stories