కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనానికి ఆమోదం
Sakshi Education
తెలంగాణలో కాంగ్రెస్ శాసన సభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వినతికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని ధ్రువీకరిస్తూ శాసనసభ కార్యదర్శి జూన్ 6న బులెటిన్ విడుదల చేశారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్ విపక్ష హోదా కోల్పోయింది. తెలంగాణ శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చే యడంతో తెరాస బలం 103కు (నామినేటెడ్ సభ్యునితో కలిపి)పెరిగింది. కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులు మిగిలారు. దీంతో 7గురు సభ్యులు కలిగిన మజ్లిస్ పార్టీ తెరాస తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మరోవైపు హూజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి జూన్ 6న రాజీనామా చే శారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా ఆయన గెలుపొందారు. నిబంధనల మేరకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనానికి ఆమోదం
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Published date : 07 Jun 2019 05:50PM