Skip to main content

కామత్ ప్యానెల్ సిఫారసులకు ఆర్‌బీఐ ఆమోదం

కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించే విషయమై కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది.
Current Affairs
రుణాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ఐదు రకాల ఫైనాన్షియల్ రేషియోలు, 26 రంగాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిమితులను ప్యానెల్ సూచించింది. మాజీ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన రుణాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనల కోసం 2020, ఆగస్ట్ 7న ఆర్‌బీఐ ప్యానెల్‌ను నియమించగా, సెప్టెంబర్ 4న ప్యానెల్ ఆర్‌బీఐకి తన నివేదికను సమర్పించింది. ఈ సిఫారసులకు పూర్తిగా అంగీకారం తెలిపినట్టు సెప్టెంబర్ 7న ఆర్‌బీఐ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం..
కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికా వ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది.+

క్విక్ రివ్యూ :

ఏమిటి : కేవీ కామత్ ప్యానెల్ సమర్పించిన సిఫారసులకుఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : కరోనా నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోయిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించే విషయమై
Published date : 09 Sep 2020 12:23PM

Photo Stories