జూన్ వరకూ ఆర్థిక సంవత్సరం పొడిగింపు
Sakshi Education
కోవిడ్-19తో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది.
దీనితో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుంది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. అంటే 12 నెలల పాటు ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో 15 నెలలపాటు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగనుంది. ‘‘2020–21 ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుంది’’ అని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, జూన్ వరకూ ఆర్థిక సంవత్సరం పొడిగింపు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : భారత్
ఎందుకు : కోవిడ్-19తో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో
Published date : 31 Mar 2020 06:33PM