Skip to main content

జూన్ నుంచి ఒకే దేశం-ఒకే రేషన్ అమలు

వలస కార్మికులకు, దినసరి కూలీలకు ప్రయోజనకర పథకంగా భావిస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’పథకం 2020, జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం, అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ రేషన్ కార్డు ద్వారా దేశంలోని ఏదైనా చౌక ధరల దుకాణం(ఎఫ్‌పీఎస్) నుంచి తమ కోటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారు.
Current Affairsవన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ విషయమై కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ డిసెంబర్ 3న మాట్లాడుతూ... బయోమెట్రిక్ లేదా ఆధార్ ధ్రువీకరణ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘ఉపాధి కోసం లేదా దేశవ్యాప్తంగా తమ నివాస చిరునామా మార్చుకునే వలస కార్మిక లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఇతర రంగాల కార్మికులకు ఈ వ్యవస్థ ప్రయోజనం చేకూరుస్తుంది’అని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ధ్రువీకరణను సమన్వయం చేయడానికి ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ స్టాండర్డ్’పై కృషి చేస్తోందని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020, జూన్ నుంచి వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ పథకం అమలు
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
Published date : 04 Dec 2019 05:40PM

Photo Stories