జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్ చార్జీలు ఎత్తివేత
Sakshi Education
ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)లపై అన్ని రకాల చార్జీలను జూలై 1 నుంచి ఎత్తివేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.
అదే రోజు నుంచి కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయాలని బ్యాంకులను కోరినట్టు జూన్ 11న తెలిపింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేస్తున్న నగదు బదిలీలపై ఆర్‌బీఐ నామమాత్రపు చార్జీలను బ్యాంకుల నుంచి వసూలు చేస్తోంది. దీంతో బ్యాంకులు సైతం కస్టమర్ల నుంచి చార్జీల రూపంలో ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాయి. ఎస్‌బీఐ అయితే నెఫ్ట్ లావాదేవీలపై రూ.1-5 వరకు, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై రూ.5-50 మధ్యలో వసూలు చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)లపై ఛార్జీల ఎత్తివేత
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూలై 1 నుంచి ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్)లపై ఛార్జీల ఎత్తివేత
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 12 Jun 2019 06:21PM