జస్టిస్ పుష్ప ఏ హైకోర్టు అదనపు జడ్జీగా ప్రమాణం చేశారు?
Sakshi Education
లైంగికదాడి కేసుల్లో రెండు వివాదాస్పద తీర్పులు వెలువరించిన బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా ఫిబ్రవరి 13న అదనపు జడ్జీగా ప్రమాణం చేశారు.
అదనపు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె పదవీ కాలం ఫిబ్రవరి 12తో ముగిసింది. మరో ఏడాది కాలానికి గాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నితిన్ జమ్దార్ ఆమెతో ప్రమాణం చేయించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా హాజరయ్యారు.
లైంగిక దాడి కేసుల్లో జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం కావడంతో శాశ్వత జడ్జిగా నియమించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది. కాగా, శాశ్వత జడ్జిగా నియమితులయ్యే వారు ముందుగా రెండేళ్ల కాలానికి గాను తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేయాలనే నిబంధన ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాంబే హైకోర్టు అదనపు జడ్జీగా ప్రమాణం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : జస్టిస్ పుష్ప గనేడివాలా
ఎక్కడ : బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర

Published date : 15 Feb 2021 05:57PM