Skip to main content

జోర్డాన్‌ దేశ రాజధాని నగరం పేరు?

జోర్డాన్‌ రాజ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వెలువడిన వార్తలపై రాజు అబ్దుల్లా–2 తొలిసారిగా స్పందించారు.
Current Affairs
ఏప్రిల్‌ 7న ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశద్రోహం కుట్రకు తెరపడిందని చెప్పారు. దేశాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్‌ హమ్జాను గృహ నిర్బంధంలో ఉంచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అబ్దుల్లా–2 స్పందిస్తూ తమ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయని స్పష్టం చేశారు.

జోర్డాన్‌...
రాజధాని: అమ్మన్‌; కరెన్సీ: జోర్డానియన్‌ దినార్‌
జోర్డాన్‌ ప్రస్తుత రాజు: అబ్దుల్లా–2 బిన్‌ అల్‌ హుస్సేన్‌
జోర్డాన్‌ ప్రస్తుత ప్రధానమంత్రి: బిషర్‌ అల్‌–ఖాసావ్నే
Published date : 08 Apr 2021 05:39PM

Photo Stories