Daily Current Affairs in Telugu: జనవరి 16th, 2023 కరెంట్ అఫైర్స్
Jyothi Surekha: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కోల్‌కతాలో రెండు రోజులపాటు జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్‌లో విజయవాడకు చెందిన 26 ఏళ్ల జ్యోతి సురేఖ డబుల్ 50 మీటర్ల రౌండ్‌లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లు సాధించింది. తొలి రోజు 72 బాణాలు, రెండో రోజు మరో 72 బాణాలు ఉపయోగించారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో బ్రిటన్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ 1417 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. 24 మంది ఆర్చర్లు పాల్గొన్న సెలెక్షన్ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ట్రయల్స్ ద్వారా ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీలలో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేస్తారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Miss Universe 2022: మిస్ యూనివర్స్‌గా ఆర్‌బోనీ గాబ్రియల్
అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. అమెరికా లూసియానాలో జరిగిన ఈ పోటీలో దాదాపు 80 మందికి పైగా పోటీ పడ్డారు. విన్నర్ గాబ్రియల్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్‌ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది మంది విశ్వసుందరి టైటిల్‌ను దక్కించుకోగా.. అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్‌ఏ రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో మిస్ వెనిజులా ఆమంద డుడామెల్ తొలి రన్నరప్‌గా, మిస్ డొమిన్‌కన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
Mrs World 2022: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్
భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా దివిట రాయ్ టాప్ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది.
విశ్వ సుందరి స్టేజ్‌పై హర్నాజ్ రెండు డిఫరెంట్ గౌన్లతో మెరిశారు. ఈ స్పెషల్ గౌనుపై 1994లో మిస్ యూనివర్స్‌గా గెలిచిన సుష్మితా సేన్ ఫోటో ఉండటం విశేషం. కాగా హర్నాజ్ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందించిన విషయం తెలిసందే. 1994లో సుష్మితా సేన్, 2000 సంవత్సరంలో లారా దత్తా విశ్వ సుందరిగా నిలిచారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
James Webb Telescope: 'మరో భూమి'ని ధృవీకరించిన పరిశోధకులు
దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉంది. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్‌ఎస్475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు అన్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్ చొప్పున వేసేస్తోందట. పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మృతి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నడుస్తూ కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి(76) గుండెపోటుకు గురై మృతి చెందారు. సంతోఖ్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. జనవరి 14న ఫిల్లౌర్ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురికాగా, వెంటనే అంబులెన్స్‌లో ఫగ్వారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
Risk Of Stroke: బ్రెయిన్ స్ట్రోక్‌కి రక్తం గ్రూప్‌తో లింక్
Heart Diseas: నడకతో గుండె పదిలం..!
ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మీ గుండెకు వచ్చే ముప్పు తగ్గుతుందని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు వేసే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గిపోతోందని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్ సర్క్యులేషన్ తాజా అధ్యయనం వివరాలను ప్రచురించింది. ఆ అధ్యయనం ప్రకారం రోజుకి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె వ్యాధులు వచ్చే ముప్పు 40–50 శాతం తగ్గిపోతుంది. మధ్య వయస్కులు రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం 50% తగ్గిపోతుంది.
ఇక 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్త వయసులో ఉన్న వారి గుండె ఆరోగ్యానికి, వారి నడకకు ఎలాంటి సంబంధమూ లేదు. నడకకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకుపై ఇప్పటివరకు జరిగిన ఎనిమిది అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించి తాజా అధ్యయనాన్ని రూపొందించారు. 18 ఏళ్లకు పైబడిన వయసున్న వారు 20,152 మంది ఇందులో పాల్గొన్నారు. ఆరేళ్లపాటు వారి స్మార్ట్ వాచ్‌లు, ఫోన్‌ల్లో రికార్డయిన వివరాల ద్వారా తాజా అధ్యయనాన్ని రూపొందించారు.
Glaciers Melting: భూ గోళానికి ముంచుకొస్తున్న ముప్పు!
University of Geneva: ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్యథ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్‌ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు.
Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై
Ali Reza Akbari: ఇరాన్‌లో మాజీ అధికారికి ఉరి
బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి.
Covid Deaths: చైనాలో 35 రోజుల్లో.. 60 వేల కరోనా మరణాలు
చైనాలో కోవిడ్–19 కల్లోలం కొనసాగుతూనే ఉంది. గత 35 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 59,938 మంది కరోనా వల్ల మరణించారని నేషనల్ హెల్త్ కమిషన్ జనవరి 14న తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 8 నుంచి ఈ ఏడాది జనవరి 12 దాకా ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.
Covid: దేశ జనాభాలో 64 శాతం మందికి కరోనా!
Mohammed Faizal: లక్షద్వీప్ ఎంపీపై వేటు
హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ జనవరి 13వ తేదీ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.