జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
Sakshi Education
జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని మధురలో సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పశుపోషణ లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మనుగడ సాధించడం సాధ్యమా? అని మోదీ ప్రశ్నించారు. ఉగ్రమూకలకు పాకిస్తాన్‌లో అన్నిరకాలుగా అండదండలు అందజేస్తున్నారనీ, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. దేశభద్రత విషయంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
12 వేలకోట్లతో వాక్సినేషన్
దేశంలోని 50 కోట్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, పందులకు గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండీ) సోకకుండా రూ.12,652 కోట్లతో వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. అనంతరం ఓ మహిళా బృందంతో కలిసి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌ను వేరుచేశారు. 2025 నాటికి జంతు సంబంధిత వ్యాధులను నియంత్రించాలనీ, 2030 నాటికి పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ చెప్పారు. 2022 నాటికి దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ జంతువ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మధుర, ఉత్తరప్రదేశ్

Published date : 12 Sep 2019 03:55PM