Skip to main content

జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడిదారుల సదస్సు

జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు శ్రీనగర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు జమ్మూక శ్మీర్ అధికార యంత్రాంగం ఆగస్టు 13న తెలిపింది.
2019, అక్టోబర్ 12 నుంచి మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుందని వెల్లడించింది. సదస్సుకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చేపట్టనున్న రోడ్డు షోలను త్వరలో గవర్నర్ ప్రారంభిస్తారని పరిశ్రమల ముఖ్య కార్యదర్శి నవీన్ చౌధురి తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అక్టోబర్ 12 నుంచి పెట్టుబడిదారుల సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : జమ్మూకశ్మీర్ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి నవీన్ చౌధురి
ఎక్కడ : శ్రీనగర్, జమ్మూకశ్మీర్
Published date : 14 Aug 2019 07:07PM

Photo Stories