Skip to main content

జమ్మూకశ్మీర్‌లో కొత్తగా అధికార భాషల హోదా పొందిన భాషలు?

జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020’కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపారు.
Current Affairs
ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు-2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020కు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : జమ్మూ, కశ్మీర్‌లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు
Published date : 29 Sep 2020 01:19PM

Photo Stories