జమ్మూకశ్మీర్‌లో 15 దేశాల రాయబారులు
Sakshi Education
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సహా భారత్‌లోని 15 దేశాల రాయబారులు జనవరి 9న పర్యటించారు.
బంగ్లాదేశ్, వియత్నాం, నార్వే, మాల్దీవ్‌స, దక్షిణ కొరియా, మొరాకొ, నైజీరియా తదితర దేశాల రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొందరు రాజకీయ నేతలు, సైన్యాధికారులు, పౌరసమాజ ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. వారికి లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ కశ్మీర్ పరిస్థితులను వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌లోని 15 దేశాల రాయబారులుపర్యటన
ఎప్పుడు : జనవరి 9
ఎక్కడ : జమ్మూకశ్మీర్
ఎందుకు : జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు
మాదిరి ప్రశ్నలు

1. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. కేజేఎస్ ధిల్లాన్
2. గిరిశ్ చంద్ర ముర్ము
3. వికాస్ స్వరూప్
4. శ్రీనివాస్ సిన్హా
- View Answer
- సమాధానం : 2
2. ప్రసుతం లధాఖ్ గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
1. జలంధర్ జోషి
2. రామకృష్ణ మాథుర్
3. రాధాకృష్ణ మాథుర్
4. వినీత్ జోషి
- View Answer
- సమాధానం : 3
Published date : 10 Jan 2020 05:56PM