జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
Sakshi Education
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 19న ప్రకటించారు.
నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే జూన్ 19 నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
ఎవరు: ప్రధాన మంత్రి నరరేరంద్ర మోదీ
ఎప్పుడు: జూన్ 19న
క్విక్ రివ్యూ:
ఏమిటి: జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
ఎవరు: ప్రధాన మంత్రి నరరేరంద్ర మోదీ
ఎప్పుడు: జూన్ 19న
Published date : 20 Jun 2019 06:02PM