జలరవాణా శాఖగా నౌకాయాన శాఖ పేరు మార్పు
Sakshi Education
గుజరాత్‌లోని హజీరా(సూరత్ జిల్లా), గోగా(బావ్‌నగర్ జిల్లా) మధ్య రో-పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ సర్వీసు 370 కి.మీ దూరాన్ని 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నాం. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాలి. నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తాం’’ అని చెప్పారు.
Published date : 09 Nov 2020 05:56PM