Skip to main content

జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ ప్రారంభం

ముంబైలో సెప్టెంబర్ 28న స్కార్‌పీన్ తరహా జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ, పీ-17ఏ ఫ్రిజెట్స్‌తో కూడిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ నీల్‌గిరిలను వేర్వేరు కార్యక్రమాలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ఐఎన్‌ఎస్ ఖండేరీ రాకతో నావికాదళ శక్తిసామర్థ్యాలు, శత్రువుపై దాడి చేయగల సామర్థ్యం మరింత పెరిగిందన్న విషయాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలని అన్నారు. జలాంతర్గాములను స్వయంగా తయారు చేసుకోగల అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి కావడం ఎంతైనా గర్వకారణమని అన్నారు.

ఎన్‌ఎస్ ఖండేరీ ప్రత్యేకతలు..
  • భారత్ సొంతంగా నిర్మించుకున్న కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో రెండోది.
  • ఐఎన్‌ఎస్ కల్వరి 2017 డిసెంబరు నుంచి పనిచేస్తోంది.
  • మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించిన ఖండేరీ అతితక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది.
  • డీజిల్, విద్యుత్తు రెండింటినీ వాడుకుని పని చేయగలదు.
  • ఏకకాలంలో గంటకు 20 నాటికల్ మైళ్ల వేగంతో ఆరు క్షిపణులను ప్రయోగించవచ్చు.
  • మొత్తం 36 మంది సిబ్బంది ప్రయాణించవచ్చు.
  • సుమారు 45 రోజులపాటు ఏకధాటిగా సముద్రంలో ఉండగలగడం దీని ప్రత్యేకత.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ఖండేరీ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 30 Sep 2019 05:49PM

Photo Stories