Skip to main content

జియో 5జీ మొబైల్ నెట్‌వర్క్ పరీక్షలు విజయవంతం

దేశీయంగా 5జీ టెక్నాలజీ మొబైల్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రిలయన్స్ జియో, క్వాల్‌కామ్ టెక్నాలజీస్ అక్టోబర్ 20న వెల్లడించాయి.
Current Affairs
క్వాల్‌కామ్ 5జీ ఆర్‌ఏఎన్ ప్లాట్‌ఫాంపై రిలయన్ ్స జియో 5జీఎన్ ఆర్ సొల్యూషన్ తో 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌ను సాధించగలిగినట్లు తెలిపాయి. మరింత వేగవంతమైన డేటా ట్రాన్ ్సఫర్‌కు 5జీ టెక్నాలజీ తోడ్పడుతుంది.

క్వాల్‌కామ్‌తో కలిసి...
దేశీ అవసరాలకు అవసరమైన 5జీ సొల్యూషన్ ్స, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియో వెల్లడించింది. స్థానికంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు, ఆత్మనిర్భర భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జియో 5జీ మొబైల్ నెట్‌వర్క్ పరీక్షలు విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎవరు : రిలయన్స్ జియో, క్వాల్‌కామ్ టెక్నాలజీస్
ఎందుకు : దేశీ అవసరాలకు అవసరమైన 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చెందుకు
Published date : 21 Oct 2020 05:46PM

Photo Stories