జీహెచ్‌ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
Sakshi Education
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా చేతుల మీదుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈ అవార్డును అందుకున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు, పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తూ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టినందుకు జీహెచ్‌ఎంసీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తున్నందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన కృషి చేస్తున్నందుకు
Published date : 16 Feb 2019 03:13PM