Skip to main content

జీఆర్‌పీ ప్రోగ్రామ్‌కు ఏపీఈఆర్‌సీ చైర్మన్

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2019, నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న రెండో అంతర్జాతీయ రెగ్యులేటరీ పర్‌స్పెక్టివ్ (జీఆర్‌పీ) ప్రోగ్రామ్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి హాజరుకానున్నారు.
Current Affairsవిద్యుత్ రంగంలో, విద్యుత్ నియంత్రణ వ్యవహారాల్లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి, ఇతర అంశాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఫోరమ్ ఫర్ రెగ్యులేటర్స్ (ఎఫ్‌వోఆర్) తన కార్యకలాపాల్లో భాగంగా 2018 ఏడాది నుంచి ప్రతీ సంవత్సరం ఈఆర్‌సీ చైర్‌పర్సన్లు, సభ్యుల కోసం జీఆర్‌పీ నిర్వహిస్తోంది. 2018లో మెల్‌బోర్న్‌లో జీఆర్‌పీ నిర్వహించారు. ఈసారి సిడ్నీలో సెంటర్ ఫర్ ఎనర్జీ (సీఈఆర్), ఐఐటీ కాన్పూర్ సహకారంతో జీఆర్‌పీ జరగనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జీఆర్‌పీ ప్రోగ్రామ్‌కు ఏపీఈఆర్‌సీ చైర్మన్
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి
ఎక్కడ : సిడ్నీ, ఆస్ట్రేలియా
ఎందుకు : విద్యుత్ నియంత్రణ వ్యవహారాల్లో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అంశాలపై చర్చించేందుకు
Published date : 25 Nov 2019 05:55PM

Photo Stories