జీ20-2020 సమావేశాలు
Sakshi Education
గ్రూప్ ఆఫ్ 20(జీ-20) దేశాల 15వ శిఖరాగ్ర సమావేశాలు సౌదీ అరేబియా నేతృత్వంలో 2020, నవంబర్ 21, 22వ తేదీలలో వర్చువల్ విధానంలో జరిగాయి.
షేడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఈ సదస్సు జరగాలి... అయితే కోవిడ్-19 వైరస్ కారణంగా సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సదస్సును తొలిసారి నిర్వహించిన అరబ్ దేశంగా.. సౌదీ అరెబియా నిలిచింది. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ సదస్సుకు నేతృత్వం వహించారు. 2023లో జరగనున్న జీ20 భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
జీ20-2020 సదస్సు థీమ్: ‘‘రియలైజింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద ట్వెంటీ ఫస్ట్ (21st) సెంచరీ ఫర్ ఆల్’’
సదస్సులో మోదీ...
జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 21, 22వ తేదీలలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. నవంబర్ 22న సేఫ్‌గార్డింగ్ ద ప్లానెట్: ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ అనే అంశంపై ఆయన మాట్లాడారు.
మోదీ ప్రసంగం...
జీ-20 గురించి...
జీ-20(గ్రూప్ ఆఫ్ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ-20లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. జీ-20 దేశాలు ప్రపంచంలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాటా ఈ దేశాలదే.
జీ-20 సభ్యదేశాలు...

- రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్.
- మొదటగా ఎక్కడినుంచైనా పని చేయడం (వర్క్ ఫ్రం ఎనీవేర్) ఇప్పుడు కొత్త విధానంగా మారింది.
- జీ20 వర్చువల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలి.
- నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలి. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలి.
- ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదు.
- పారిస్ ఒప్పందంలోని లక్ష్యాల కంటే ఎక్కువే భారత్ సాధించింది.
- భారత్‌లో ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమం.
జీ-20 గురించి...
జీ-20(గ్రూప్ ఆఫ్ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ-20లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. జీ-20 దేశాలు ప్రపంచంలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాటా ఈ దేశాలదే.
జీ-20 సభ్యదేశాలు...
- అర్జెంటీనా
- ఆస్ట్రేలియా
- బ్రెజిల్
- కెనడా
- చైనా
- ఫ్రాన్స్
- జర్మనీ
- భారత్
- ఇండోనేషియా
- ఇటలీ
- జపాన్
- మెక్సికో
- రష్యా
- సౌదీ అరేబియా
- దక్షిణ కొరియా
- దక్షిణాఫ్రికా
- టర్కీ
- యునెటైడ్ కింగ్‌డమ్
- యునెటైడ్ స్టేట్స్
- యూరోపియన్ యూనియన్
Published date : 24 Nov 2020 06:46PM