Skip to main content

జీ-7 దేశాధినేతల సదస్సు-2021కి అధ్యక్షత వహించనున్న నేత?

2021, ఫిబ్రవరి 19వ తేదీన జరగనున్న జీ-7 దేశాధినేతల వర్చువల్ భేటీకి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించనున్నారు.
Current Affairs
ప్రస్తుతం బ్రిటన్ జీ-7 అధ్యక్ష హోదాలో ఉంది. కరోనా వైరస్ టీకాను ప్రపంచ దేశాల మధ్య సమానంగా పంపిణీ చేయడం, భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనే విషయమై తీసుకోవాల్సిన చర్యలపై నేతల మధ్య చర్చ జరగనుంది.

పారిశ్రామిక దేశాలతో కూడిన జీ-7 కూటమిలో యూకేతోపాటు కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. 2021, జూన్‌లో {బిటన్‌లోని కార్న్‌వాల్‌లో జరిగే జీ-7 భేటీకి ఆతిథ్య హోదాలో భారత్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను కూడా బ్రిటన్ ఆహ్వానించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జీ-7 దేశాధినేతల సదస్సు-2021కి అధ్యక్షత వహించనున్న నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్
ఎందుకు : కరోనా టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు
Published date : 16 Feb 2021 05:47PM

Photo Stories