జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది.
ఈ పథకాన్ని ఇకపై ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు 6 రోజులు విభిన్న రకాల ఆహార పదార్థాలను అందించేలా తీర్చిదిద్దిన ఈ పథకం జనవరి 21 నుంచే ప్రారంభమైందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏటా అదనంగా రూ.344 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆయాలకు ఇస్తున్న రూ.వెయ్యిని రూ.3 వేలకు పెంచామని పేర్కొన్నారు. మరోవైపు అమ్మఒడి పథకానికి ఏటా రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో
Published date : 22 Jan 2020 06:20PM