Skip to main content

జాతీయ విద్యా దినోత్సవం

భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతి సందర్భంగా నవంబర్ 11న దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని(రాష్టీయ్ర శిక్షా దివస్) జరుపుకున్నారు.
Current Affairsజాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, బహు భాషా ప్రవీణుడు, భారత దేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మౌలానా జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1947, ఆగస్టు 15 నుంచి 1958, ఫిబ్రవరి 2 వరకు దాదాపు 11 సంవత్సరాలపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మౌలానా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ మైనార్టీ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ విద్యా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మౌలానా చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. మౌలానా జయంతిని 2008లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Published date : 13 Nov 2020 11:07AM

Photo Stories