Skip to main content

జాతీయ పత్తి పరిశోధన కేంద్రం డెరైక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?

మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా పనిచేసే ప్రతిష్టాత్మక జాతీయ పత్తి పరిశోధన కేంద్రానికి తెలుగు వ్యక్తి డాక్టర్ వై. గెరాడ్ ప్రసాద్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు.
Current Affairs
త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పత్తి పరిశోధన కేంద్రానికి డెరైక్టర్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం గెరాడ్ ప్రసాద్ హైదరాబాద్‌లోని ఐసీఏఆర్- అగ్రి టెక్నాలజీ అప్లికేషన్ పరిశోధన సంస్థ (అటారి) డెరైక్టర్‌గా ఉన్నారు.

580 జిల్లాల కోసం...
గుంటూరు జిల్లా ముట్లూరు గ్రామానికి చెందిన గెరాడ్ ప్రసాద్ 1981లో బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి బీఎస్సీ (అగ్రి) పట్టా పొందారు. తర్వాత న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి కీటక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. క్రిమికీటకాల నివారణ సంస్థలో శాస్త్రవేత్తగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జాతీయ మెట్ట పరిశోధన సంస్థలో పని చేస్తున్నప్పుడు 580 జిల్లాల కోసం కరువుపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేశారు. పర్యావరణ అనుకూల బయోపెస్టిసైడ్‌‌స విధానాలను అభివృద్ధి పరిచారు.

నెదర్లాండ్స్ ప్రభుత్వం గుర్తింపు...
అంతర్జాతీయ స్థాయిలో గెరాడ్ ప్రసాద్ సేవలకు గుర్తింపుగా నెదర్లాండ్‌‌స ప్రభుత్వం ఎన్‌యూఎఫ్‌ఎఫ్‌ఐసీ స్కాలర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహించింది. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ 2012లో డాక్టర్ బాప్ రెడ్డి మెమోరియల్ అవార్డుతో సత్కరించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జాతీయ పత్తి పరిశోధన కేంద్రం డెరైక్టర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : డాక్టర్ వై. గెరాడ్ ప్రసాద్
Published date : 09 Oct 2020 05:35PM

Photo Stories