Skip to main content

జాతీయ మెడికల్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

జాతీయ మెడికల్ బిల్లు-2019కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆగస్టు 8న తెలిపారు.
ఈ బిల్లుకు సంబంధించి త్వరలోనే గెజిట్ వెలువడుతుందని, ఆ తర్వాత ఎన్‌ఎంసీ బిల్లుకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అంతా ఆర్నెల్లలోపులోనే ముగుస్తుందని చెప్పారు. విద్యార్థుల భారాన్ని, వైద్య విద్య ఖర్చులను తగ్గించేదిగాను, వారికి నాణ్యమైన వైద్య విద్యను అందించేలా తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ఈ ఎన్‌ఎంసీ బిల్లు రూపొందించామన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ మెడికల్ బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 09 Aug 2019 05:54PM

Photo Stories