Skip to main content

జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్’ ప్రారంభమైంది.
Current Affairsన్యూఢిల్లీలో డిసెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ మిషన్ సాధనంగా ఉపయోగపడుతుందని మంత్రి రవిశంకర్ అభిప్రాయపడ్డారు.

జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ లక్ష్యాలు
  • డిజిటల్ వ్యవస్థను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా సమాచార వ్యవస్థ మౌలిక వసతులను త్వరితగతిన అభివృద్ధి చేయడం.
  • దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు.
  • ప్రస్తుతం ప్రతి వెయి్యమంది జనాభాకు 0.42గా ఉన్న టవర్ల సాంద్రతను 2024 కల్లా ఒకటికి పెంచడం.
  • మొబైల్, అంతర్జాల సేవల నాణ్యతను గుణాత్మకంగా మెరుగుపరచడం.
  • దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్, టవర్ నెట్‌వర్క్‌ను గుర్తిస్తూ డిజిటల్ ఫైబర్ మ్యాప్‌ను రూపొందించడం.
  • భాగస్వామ్య సంస్థల ద్వారా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 2022 కల్లా నాణ్యమైన బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం అందించేందుకు
Published date : 18 Dec 2019 06:02PM

Photo Stories