Skip to main content

జార్ఖండ్ నూతన డీజీపీగా విష్ణువర్ధనరావు

జార్ఖండ్ రాష్ట్ర నూతన డీజీపీగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధనరావు మార్చి 17న బాధ్యతలు స్వీకరించారు.
Current Affairs18 నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1987 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఆయన.. గతంలో జార్ఖండ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో సేవలందించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలలంకకు చెందిన విష్ణువర్ధనరావు వరంగల్ ఆర్‌ఈసీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఆయన కుమార్తె దీపిక.. ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం అమలు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. అల్లుడు విక్రాంత్ పాటిల్ విజయవాడ డీసీపీగాను, కుమారుడు హర్షవర్ధన్ అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో ఏసీబీ ఎస్పీగాను పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జార్ఖండ్ నూతన డీజీపీగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మండవ విష్ణువర్ధనరావు
Published date : 18 Mar 2020 06:27PM

Photo Stories