ఈయూ పార్లమెంట్‌కి లోక్‌సభ స్పీకర్ లేఖ
Sakshi Education
భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) తీర్మానించడంపై ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ మరియా సస్సోలీకి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జనవరి 27న లేఖ రాశారు.
‘పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రమాదకరమంటూ యూరోపియన్ పార్లమెంట్‌లో తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సభ్యులుగా తోటి శాసనసభలను, ప్రజాస్వామ్య దేశాల విధానాలను గౌరవించాలి. ఒక శాసన వ్యవస్థపై మరో శాసనవ్యవస్థ తీర్పు ఇవ్వడం సరైన విధానం కాదు’ అని లేఖలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ మరియా సస్సోలీకి లేఖ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఎందుకు : భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఈయూ తీర్మానించిన నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ మరియా సస్సోలీకి లేఖ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
ఎందుకు : భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఈయూ తీర్మానించిన నేపథ్యంలో
Published date : 28 Jan 2020 05:39PM