ఈయూ మానవ హక్కుల పురస్కారం-2020 విజేత?
Sakshi Education
బెలారస్ ప్రతిపక్ష ఉద్యమానికి.. దానికి నాయకత్వం వహిస్తున్న స్వెత్లానా తికనోస్కాయాకి యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రతిష్టాత్మక మానవ హక్కుల అవార్డు-2020 లభించింది.
సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్న బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోకు వ్యతిరేకంగా స్వెత్లానా, ఇతర బెలారస్ ప్రతిపక్ష పార్టీలు కొనసాగిస్తున్న పోరాటానికిగాను ఈ అవార్డు దక్కింది. 2020, ఆగస్టులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో లుకాషెంకో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో అతని ప్రత్యర్థిగా స్వెత్లానా పోటీ చేశారు. రిగ్గింగ్ చేసి లుకాషెంకో అధికారంలో వచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించారుు. యూరోపియన్ యూనియన్ కూడా ఆ ఎన్నికలను గుర్తించలేదు.
డిసెంబరు 10న మానవ హక్కుల దినోత్సవం...
ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్‌ఆర్)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్ లు ఏర్పాటుచేయబడ్డారుు.
360 భాషల్లోకి...
2008 డిసెంబరు 10న యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 60వ వార్షికోత్సవం జరిగింది. యునెటైడ్ నేషన్‌స సెక్రటరీ జనరల్ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్.ఆర్ రూపొందించిన డాక్యుమెంట్ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :ఈయూ మానవ హక్కుల పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : బెలారస్ ప్రతిపక్ష ఉధ్యమం, ఉధ్యమం నాయకురాలు స్వెత్లానా తికనోస్కాయా
ఎందుకు : సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్న బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకోకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నందుకు

Published date : 23 Oct 2020 06:39PM