ఇవాన్ హో కేంబ్రిడ్జ్ ల్యాబ్‌స్పేస్ ఏ ప్రాంతంలో ఏర్పాటు కానుంది?
Sakshi Education
కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సంస్థ... హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో ల్యాబ్‌స్పేస్ ఏర్పాటు చేయనుంది.
![Current Affairs](/sites/default/files/images/2021/07/08/IvanhoeCambridge.jpg)
రూ.740 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ల్యాబ్‌స్పేస్‌ను నెలకొల్పనుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో వర్చువల్ విధానంలో ఆ సంస్థ భారతీయ విభాగం సీనియర్ ప్రతినిధులు జూలై 7న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... లైఫ్ సైన్సెస్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘ఇవాన్ హో కేంబ్రిడ్జ్’ పెట్టుబడి మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ల్యాబ్‌స్పేస్ ఏర్పాటు
ఎప్పుడు : జూలై 7
ఎవరు : ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సంస్థ
ఎక్కడ : జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్
ఎందుకు : లైఫ్ సైన్సెస్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ల్యాబ్‌స్పేస్ ఏర్పాటు
ఎప్పుడు : జూలై 7
ఎవరు : ఇవాన్ హో కేంబ్రిడ్జ్ సంస్థ
ఎక్కడ : జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్
ఎందుకు : లైఫ్ సైన్సెస్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి...
Published date : 08 Jul 2021 06:14PM