ఇథనాల్ ధర లీటరుకు రూ.1.84 పెంపు
Sakshi Education
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ సెప్టెంబర్ 3న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2019, డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు కొత్త రేట్ల ప్రకారం కొనుగోళ్లు జరుపుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
సీసీఈఏ సి గ్రేడు మొలాసిస్ నుంచి నుంచి తీసిన ఇథనాల్ ధర లీటరుకు 29 పైసలు పెంచడంతో కొత్త ధర రూ. 43.75గా ఉండనుంది. ఇక ’బి గ్రేడు మొలాసిస్’ నుంచి తీసే ఇథనాల్ రేటు రూ. 1.84 పెరిగి లీటరు ధర రూ. 54.27కి చేరుతుంది. 2018-19లో 226 మిలియన్ టన్నుల చమురు దిగుమతులపై భారత్ 112 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇథనాల్ ధర లీటరుకు రూ.1.84 పెంపు
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా

Published date : 06 Sep 2019 05:32PM