ఇథియోపియాలో విమాన ప్రమాదం
Sakshi Education
ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ఇథియోపియా ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్737 విమానం కుప్పకూలిన ఘటనలో 157 మంది దుర్మరణం చెందారు. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి ఆ విమానం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో దాదాపు 149మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది ఉన్నారని, వారంతా మృతి చెందారని విమాన యాజమాన్యం వెల్లడించింది. ఈ విమానంలో 33 దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు.
Published date : 11 Mar 2019 04:59PM