ఇథియోపియా ఆర్మీ చీఫ్ మెకొన్నెన్ హత్య
Sakshi Education
ఆఫ్రికాలో జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సియరే మెకొన్నెన్, మరో పదవీ విరమణ చెందిన జనరల్ జూన్ 22న హత్యకు గురయ్యారు.
ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అంహర(అటానమస్ రీజన్) ప్రాంతీయాధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్ ఆయన సలహాదారుడిని అబచెవ్ అంగరక్షకులే కాల్చి చంపారు. అమ్హారా రాష్ట్రాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ఆ రాష్ట్ర భద్రతావిభాగం అధ్యక్షుడు జనరల్ అసమ్‌న్యూ త్సిగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హత్య
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : సియరే మెకొన్నెన్
ఎక్కడ : ఇథియోపియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇథియోపియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హత్య
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : సియరే మెకొన్నెన్
ఎక్కడ : ఇథియోపియా
Published date : 24 Jun 2019 06:34PM