Skip to main content

ఇటీవల ఏ హైకోర్టులో విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు?

గుజరాత్‌ హైకోర్టులో ఆన్‌లైన్‌ లైవ్‌ కోర్టు ప్రొసీడింగ్స్‌ ఆరంభమైంది.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జూలై 17న ఆన్‌లైన్‌ విధానం ద్వారా విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్‌ స్ట్రీమింగ్‌(ప్రత్యక్ష ప్రసారం) ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థలో అనవసరపు గోప్యత తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. అయితే లైవ్‌స్ట్రీమ్‌ అనేది కొన్ని సందర్భాల్లో రెండంచులున్న కత్తిలాగా మారుతుందని, అలాంటప్పుడు న్యాయమూర్తులు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తులు పాపులర్‌ ఒపీనియన్‌(జనాకర్షక అభిప్రాయాలు)కు లొంగకూడదన్నారు. లైవ్‌స్ట్రీమింగ్‌తో క్లయింట్ల ప్రైవసీకి సంబంధించి ఇబ్బందులు ఎదురుకావచ్చన్నారు. కోర్టుల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని కమిటీ చేస్తున్న కృషిని సీజేఐ కొనియాడారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : గుజరాత్‌ హైకోర్టు ఆన్‌లైన్‌ లైవ్‌ కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రారంభం
ఎప్పుడు : జూలై 17
ఎవరు : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ
Published date : 19 Jul 2021 06:23PM

Photo Stories