Skip to main content

ఇటీవల ఆయుష్మాన్ భారత్‌లో పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం?

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairs
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఈ విషయం తెలిపారు. సమావేశంలో ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని ప్రధాని సమీక్షించారు.

ఆయుష్మాన్ భారత్...
దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద 1393 రకాలైన వ్యాధులకు చికిత్స అందిస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడానికి
Published date : 01 Jan 2021 06:37PM

Photo Stories