Skip to main content

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అల్ బాగ్దాదీ హతం

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 27న వెల్లడించారు.
సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాదీ హతమైనట్టు తెలిపారు. తమ సైన్యానికి చెందిన కుక్కలు వెంబడించడంతో ఓ టన్నెల్‌లోకి పరిగెత్తిన బాగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. చనిపోయే ముందు బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను హతమార్చాడని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కొందరు బాగ్దాదీ అనుచరులు కూడా మరణించినట్లు చెప్పారు. అమెరికా సైనికుల్లో ఎవరికీ ఏమీ కాలేదన్నారు.

ఆపరేషన్ కై లా ముల్లెర్
పిల్లలు, మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించిన బాగ్దాదీని చంపే ఆపరేషన్‌కు అమెరికా అధికారులు ‘కై లా ముల్లెర్ ’ అని నామకరణం చేశారు. అమెరికాలోని ఆరిజోనాకి చెందిన కైలా ముల్లెర్ (26) ఒక సేవా సంస్థలో పనిచేస్తుండేది. ఆమె ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తుండగా ఐసిస్ కిడ్నాప్ చేసింది. ఐసిస్ అధినేత బాగ్దాదీ ఆమెపై అత్యంత క్రూరంగా అనేకమార్లు అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఈ ఘటన 2013లో జరిగింది. ఈ నేపథ్యంలో తాజా ఆపరేషన్‌కు కై లా ముల్లెర్ అని పేరు పెట్టారు. 2015 ఫిబ్రవరిలో ఐసిస్ కస్టడీలో కైలా ముల్లెర్ మరణించిన విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : సిరియా
ఎందుకు : అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో
Published date : 28 Oct 2019 05:38PM

Photo Stories