ఇరాన్‌లో కూలిన ఉక్రెయిన్ పౌర విమానం
Sakshi Education
అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్‌లో ఓ విమానం కుప్పకూలింది.
ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ కి చెందిన పౌర విమానం బోయింగ్ 737 టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. ఈ విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు.
కూలిపోయిందా? కూల్చేశారా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని ప్రచారం మొదలైంది.
మాదిరి ప్రశ్నలు
కూలిపోయిందా? కూల్చేశారా?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని ప్రచారం మొదలైంది.
మాదిరి ప్రశ్నలు
1. క్రింది వాటిలో ఉక్రెయిన్ రాజధాని, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. డొడోమా, షిల్లాంగ్
2. కీవ్, హైనియా
3. కంపాలా, షిల్లింగ్
4. అంకారా, లీరా
- View Answer
- సమాధానం : 2
2. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?
1. వ్లాడిమిర్ జెలెంస్కీ
2. వ్లాదిమిర్ పుతిన్
3. రోడ్రిగో డ్యూటెర్టే
4. క్రిస్టియానా రోనాల్డో
- View Answer
- సమాధానం : 1
Published date : 09 Jan 2020 05:39PM