ఇరాన్ రక్షణ మంత్రి హటామితో రాజ్‌నాథ్ చర్చలు
Sakshi Education
ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సెప్టెంబర్ 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని ఇరాన్‌కు వచ్చారు.
పాక్ చెరలో 19మంది భారతీయులు
అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశామని, 2020, నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని సెప్టెంబర్ 7న పేర్కొన్నారు.
ఖల్సా ఉగ్రవాదులు అరెస్టు..
సిక్కు ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఇద్దరిని సెప్టెంబర్ 7న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని భూపేందర్ అలియాస్ దిలావర్ సింగ్, కుల్వంత్ సింగ్‌గా గుర్తించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమీర్ హటామితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : టెహ్రాన్, ఇరాన్
ఎందుకు : ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించేందుకు

Published date : 09 Sep 2020 12:20PM