Internet Users in AP: ఇంటర్‌నెట్ వినియోగదారుల్లో ఏపీ టాప్
ఇంటర్నెట్ వినియోగం, ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌లలో దేశంలో అన్ని రాష్ట్రాలను మించిపోయిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2022–23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదిక వెల్లడించింది.
దేశం మొత్తం ప్రతి వంద మంది జనాభాకు 59.97 ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌లలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ వంద మంది జనాభాకు 120.33 ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశ సగటు, ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువగా రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దేశం మొత్తం 2018–19లో ప్రతి వంద మందికి 47.94 ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉండగా ఇప్పుడు 59.97కు పెరిగాయి.
రాష్ట్రంలో 2018–19లో ప్రతి వంద మందికి 94.59 సబ్‌స్క్రిప్షన్‌లు ఉండగా 2022–23 నాటికి 120.33 సబ్‌స్క్రిప్షన్‌లకు పెరగడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ తరువాత కేరళలో అత్యధికంగా సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కేరళలో ప్రతి వంద మందికి 87.50 సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి. ఆ తరువాత పంజాబ్‌లో 85.97 సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి.పశ్చిమబెంగాల్‌లో అత్యల్పంగా 41.26 సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది