Indian Bank: ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా నియమితులైన అధికారి?
Sakshi Education
ఇండియన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శాంతిలాల్ జైన్ నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : శాంతిలాల్ జైన్
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు...
ప్రస్తుతం ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021, సెప్టెంబర్ 1వ తేదీన లేదా అటు తర్వాత ఆయన కొత్త పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన బీఓబీ ఈడీగా బాధ్యతల విరమణ చేస్తారు.
కెనరా, బీఓబీ ఈడీల పదవీకాలం పొడిగింపు
కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇరువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులు దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ముఖ్యాంశాలు చూస్తే...

- కెనరా బ్యాంక్ ఈడీ ఏ మణిమేకలై పదవీకాలం 2022 ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. పదవీకాలాన్ని మరో రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కేంద్రం పొడిగించింది.
- ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఆర్ రాజగోపాల్ పదవీకాలం 2022 ఫిబ్రవరి 28తో ముగుస్తుండగా, ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పొడిగించడం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : శాంతిలాల్ జైన్
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు...
Published date : 31 Aug 2021 06:11PM