Skip to main content

ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్‌ను రూపొందించిన సంస్థ?

భారత వాయుసేన కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ (హెచ్‌ఏఎల్) పూర్తి దేశీయ సాంకేతికతతో రూపొందించిన ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ (ఐజేటీ) విమానానికి నవంబర్ 23న బెంగళూరు సమీపంలోని బనశంకరిలో కీలకమైన స్పిన్ టెస్ట్‌ను నిర్వహించారు.
Current Affairs ఇద్దరు సీనియర్ పైలట్లు విమానాన్ని నింగిలోకి తీసుకెళ్లారు. విమానం సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో క్షుణ్నంగా పరీక్షించారు.

కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో...
ఐజేటీ శిక్షణ, యుద్ధ విమానంగా ఉపయోగపడుతుందని హెచ్‌ఏఎల్ తెలిపింది. వాయుసేనలో ఉన్న పాతబడిన కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో వీటిని మోహరించనున్నారు. ఐజేటీ ద్వారా బాంబులను ప్రయోగించడంతోపాటు ట్యాంకులు తదితర యుద్ధ సామగ్రిని తరలించవచ్చు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ (ఐజేటీ) విమానం రూపకల్పన
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ (హెచ్‌ఏఎల్)
ఎందుకు : భారత వాయుసేన కోసం...
Published date : 24 Nov 2020 06:32PM

Photo Stories