Skip to main content

ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.
విద్యాశాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జూన్ 27న నిర్వహించిన సమీక్ష సందర్భంగా జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జగన్ తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం వర్తింపు
ఎప్పుడు : జూన్ 27
ఎవరు : సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 28 Jun 2019 05:59PM

Photo Stories